KINGDOM: దేవరకొండ బర్త్డే స్పెషల్.. ‘కింగ్‌‌‌‌డమ్’ కొత్త అప్డేట్తో అన్నిటికీ క్లారిటీ వచ్చేసింది

KINGDOM: దేవరకొండ బర్త్డే స్పెషల్.. ‘కింగ్‌‌‌‌డమ్’ కొత్త అప్డేట్తో అన్నిటికీ క్లారిటీ వచ్చేసింది

విజయ్ దేవరకొండ కింగ్‍డమ్ మూవీ భారీ అంచనాల మధ్య రాబోతుంది. మే 30న సినిమా విడుదల కానుంది. ఇదే డేట్కి పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రాబోతున్నట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. కానీ, మేకర్స్ అనౌన్స్ చేసిన డేట్కే రిలీజ్ కానుందని సినీ వర్గాల సమాచారం. 

ఈ తరుణంలో కింగ్‍డమ్ చిత్రబృందం నుంచి క్రేజీ న్యూస్ బయటకి వచ్చింది. విజయ్ ఫ్యాన్స్ కు కింగ్‍డమ్ రిలీజ్ విషయంలో ఏ మాత్రం డైలమా అవసరం లేదని.. చెప్పిన టైంకే మూవీ రాబోతుందని మేకర్స్ నుంచి సమాచారం.

అయితే, హరిహర వీరమల్లు పలుమార్లు రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. నేడు మే9నే వీరమల్లు రావాల్సి ఉంది. షూటింగ్ ఆలస్యం కావడంతో మే30న వస్తుందని టాక్ వినిపించింది. కానీ, ఇపుడీ వీరమల్లు జూన్ 12న రావడానికి సిద్దమైనట్లుగా తెలుస్తోంది. దాంతో విజయ్ దేవరకొండ ఆగమనం ఉంటుందని క్లారిటీ రివీల్ అయింది.

Also Read :  అప‌రాధి రివ్యూ.. మూడు పాత్ర‌లతో ఉత్కంఠ

అంతేకాకుండా.. నేడు మే9న విజయ్ దేవరకొండ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ కింగ్‍డమ్ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో కింగ్‍డమ్ మే 30న రానుందని డేట్ అనౌన్స్ చేశారు. కాబట్టి, ఇప్పటివరకు కింగ్‍డమ్ రిలీజ్ విషయంలో వస్తోన్న రూమర్స్ అన్నిటికీ క్లారిటీ వచ్చింది. 

ఇదిలా ఉంటే, ఈ మూవీకి సంబంధించి సీజీ వర్క్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు మరో టాక్. ఈ నెలాఖరికి అది పూర్తవుతుందా లేదా అనే సస్పెన్స్ వినిపిస్తోంది. దాంతో మే 30న రిలీజ్ అవ్వడం కష్టమే అనే మరో రూమర్ క్రియేట్ అయింది. ఇపుడీ ఈ లేటెస్ట్ పోస్టర్తో క్లారిటీ వచ్చింది. 

ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఇప్పటికే కింగ్‍డమ్ నుంచి రిలీజైన సాంగ్, టీజర్కు భారీ ప్రేక్షకాదరణ తెచ్చుకున్నాడు. తన నటనలోని స్వాగ్ ఏంటనేది రిలీజైన టీజర్ చెప్పకనే చెప్పింది. అంతేకాకుండా టీజర్తో సినిమా సక్సెస్ అవ్వడం గ్యారెంటీ అంటూ తన ఫ్యాన్స్ ను కూడా ఫిక్స్ అయ్యేలా చేశాడు. మరి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎలాంటి కంటెంట్ తో వస్తున్నాడో చూడాలి.