Family Star: మధురము కదా ప్రతొక నడక..వినసొంపుగా ఫ్యామిలీ స్టార్ మెలోడీ

Family Star: మధురము కదా ప్రతొక నడక..వినసొంపుగా ఫ్యామిలీ స్టార్ మెలోడీ

స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (FamilyStar). సీతారామం(Sitaramam) ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (SVC54) పై దిల్ రాజు (Dil raju) నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ఆడియన్స్ ని వీపరీతంగా  ఆకట్టుకుంటోంది. ''

లేటెస్ట్గా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘మధురము కదా ప్రతొక నడక నీతో కలిసి..’అని సాగే మెలోడీ పాట మనసుకు హత్తుకుంటుంది. గోపి సుందర్ కంపోజ్ చేసిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యం అందించగా శ్రేయ ఘోషల్ పాడింది. ఈ పాటలో వచ్చే సాకీ ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేసేలా లిరిక్స్..ట్యూన్  భలే ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పటికీ ఈ మూవీ నుంచి రిలీజైన రెండు సాంగ్స్ చార్ట్ బ్లాస్టర్ అనిపించుకున్నాయి. ‘నందనందన’ అంటూ వచ్చిన సాంగ్ బాగా పాపులర్ అయింది. విజయ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. అలాగే కల్యాణి వచ్చా వచ్చా పంచ కల్యాణి తెచ్చా తెచ్చా ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ మూడో పాట కూడా నచ్చేస్తుంది. ఆలస్యం చేయకుండా ఈ మెలోడీ గీతాన్ని వినేయండి.  

పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీతగోవిందం సినిమా వచ్చి సూపర్ హిట్ ఐన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరో పదేళ్లు తమ ఫ్యాన్స్ మాట్లాడుకునేలా ఫ్యామిలీ స్టార్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్.