విజయ్ దేవరకొండ ఇంట్లో ప్రత్యేక పూజలు

విజయ్ దేవరకొండ ఇంట్లో ప్రత్యేక పూజలు

విజయ్ దేవర కొండ ఇప్పుడు ఈ పేరు సంచలనం. తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుని.. హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అతను నటించిన ‘లైగర్’ సినిమా కోసం అందరూ వేచి చూస్తున్నారు. విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 25వ తేదీన విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో చిత్ర టీం పర్యటిస్తోంది. ఇందులో విజయ్, అనన్య పాండేతో పాటు దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ ఇతరులు వెళుతున్నారు. భారతదేశం అంతటా పర్యటిస్తున్న క్రమంలో.. తమకు రక్షణ అవసరమని అమ్మ భావించి, పవిత్రమైన కంకణాలు కట్టిందని విజయ్ ఓ ట్వీట్ చేశాడు. అందులో రెండు ఫొటోలున్నాయి. ఇంట్లో పూజలు నిర్వహించినట్లుగా ఉంది.

విజయ్, అనన్య పాండేలను పూజారులు ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు తాము పర్యటిస్తుంటే.. అమ్మ ప్రశాంతంగా నిద్రపోతుందని ట్వీట్ లో విజయ్ వెల్లడించారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా అంచనాలను భారీ పెంచాయి. మైక్ టైసన్ కీలకపాత్రలలో నటించిన ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.