‘అన్‌స్టాపబుల్‌ లైగర్’

‘అన్‌స్టాపబుల్‌ లైగర్’

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం 'లైగర్'. విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం ఈనెల 25న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

అయితే ఈ మూవీ విడుదలౌతున్న నేపథ్యంలో చిక్కుల్లో పడింది. ‘బాయ్‌‌కాట్’ హ్యాష్ ట్యాగ్‌తో కొందరు నెటిజన్స్ ఈ సినిమాను ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ హ్యాష్ ట్యాగ్‌కి వ్యతిరేకంగా.. విజయ్ ఫ్యాన్స్ కూడా అదే రీతిలో సపోర్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ‘ఐసపోర్ట్‌లైగర్’ (#ISupportLiger), ‘అన్‌స్టాపబుల్‌లైగర్’ (#UnstoppableLiger) ట్యాగ్స్‌తో ఎదురుదాడికి దిగారు. ఈ వ్యవహారంపై విజయ్ దేవరకొండ కూడా తాజా స్పందించాడు. ‘‘మనం కరెక్ట్‌గా ఉన్నప్పుడుమన ధర్మం మనం చేసినప్పుడు ఎవడిమాటా వినేదే లేదు..కొట్లాడుదాం..’’ అంటూ ఫైర్ ఎమోజీని, అలాగే లైగర్ ట్యాగ్‌ని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.