‘మాస్టర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌‌కు పండుగే

‘మాస్టర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యాన్స్‌‌కు పండుగే
చెన్నై: తమిళ స్టార్ హీరో, ఇళయ దళపతి విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమాలో నటిస్తున్నాడు. చాన్నాళ్ల కిందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. సంక్రాంతికి మాస్టర్‌‌గా విజయ్ మెరిపించబోతున్నాడు. జనవరి 13న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫిల్మ్ టీమ్ డేట్‌‌ను ప్రకటించింది. విలన్‌‌గా నటిస్తున్న మక్కన్ సెల్వన్ విజయ్ సేతుపతితో విజయ్ తలపడుతున్నట్లుగా ఉన్న ఫొటోపై రిలీజ్ డేట్ ఉన్న స్టిల్‌‌ను ట్వీట్ చేసింది. తమిళనాడులోని థియేటర్స్‌‌లో సాధ్యమైనంత ఎక్కువ సీటింగ్ కెపాసిటీతో మూవీని నడుపుకునేలా అనుమతించాలని ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామిని హీరో విజయ్ కోరారని సమాచారం. దీనికి పళని ఒప్పుకోవడంతో సినిమా యూనిట్ రిలీజ్ డేట్‌‌ను ప్రకటించిందని తెలుస్తోంది. Aana aavanna apna time naVanganna vanakkamna Ini #VaathiRaid na! ?#Vaathicoming to theatres near you on January 13. #Master #மாஸ்டர்#మాస్టర్#VijayTheMaster #MasterPongal #MasterOnJan13th pic.twitter.com/RfBqIhT95U — XB Film Creators (@XBFilmCreators) December 29, 2020