నా గుండె ముక్కలైంది..మాటలు రావట్లేదు: విజయ్

నా గుండె ముక్కలైంది..మాటలు రావట్లేదు: విజయ్

తమిళనాడు కరూర్ లో జరిగిన తొక్కిసలాట గురించి టీవీకే అధ్యక్షుడు విజయ్ మొదటి సారి స్పందించారు. వీడియో రిలీజ్ చేసిన విజయ్..  తన గుండె ముక్కలైందని మాటలు రావట్లేదన్నారు.  తొక్కిసలాట ఘటన తనను కలచివేసిందన్నారు. ఎంతో ప్రేమతో ప్రజలు తన మీటింగ్ కు వచ్చారన్న విజయ్.. త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శిస్తానని చెప్పారు. 

తన జీవితంలో ఇలాంటి ఘటనను ఎప్పుడూ ఎదుర్కోలేదన్నారు విజయ్..ఈ ఘటన జరగకుండా ఉండాల్సిందన్నారు. తాము తప్పు చేయకున్నా కేసు నమోదు చేశారని ఆరోపించారు విజయ్.  స్టాలిన్  ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే తనపై తీర్చుకోండి..ప్రజలపై కాదని సూచించారు..  కరూర్ లోనే  ఇలాంటి ఘటన ఎందుకు జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు విజయ్. త్వరలోనే నిజం బయటపడుతుందన్నారు. తాను భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తానన్న . త్వరలోనే తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటా అని చెప్పారు విజయ్.

తమిళనాడు కరూర్ జిల్లాలో సెప్టెంబర్ 27 న రాత్రి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే..ఈ  ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ అత్యంత సన్నిహితుడు, టీవీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా కార్యదర్శి మథియజగన్‎పై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్‎లో పోలీసులు సంచలన విషయాలు పేర్కొన్నారు. విజయ్ ఉద్దేశపూర్వకంగా సభకు ఆలస్యంగా వచ్చాడని.. అతడు లేట్‎గా రావడం వల్లే తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారని పోలీసులు  తెలిపారు. అనుమతి లేకుండా రోడ్ షో నిర్వహించాడని ఆరోపించారు.