Turkey Earthquake: పచ్చ బొట్టు ద్వారా మృతదేహాన్ని గుర్తించిన కుటుంబం

Turkey Earthquake: పచ్చ బొట్టు ద్వారా మృతదేహాన్ని గుర్తించిన కుటుంబం

ఫిబ్రవరి 6న టర్కీలో జరిగిన భూకంపంలో భారత్ కు చెందిన విజయ్ కుమార్ మరణించాడు. ఈ విషయాన్ని టర్కీలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఉత్తరాఖండ్ పౌఢీ జిల్లాకు చెందిన విజయ్ టర్కీలో వ్యాపార పర్యటణకు వెళ్లి మలత్యాలోని ఓ హోటల్ లో బసచేశాడు. అదే హోటల్ శిథిలాల కింద విగతజీవిగా పడిఉన్న విజయ్‌ని శనివారం సహాయక బృందాలు గుర్తించాయి. అతని ముఖం గుర్తుపట్టలేనంతగా గాయపడింది. అయితే, అతని చేతిపై ఉన్న  ఓం అనే పచ్చబొట్టు ద్వారా విజయ్ కుటుంబీకులు మృతదేహాన్ని గుర్తించారు. వీలైనంత త్వరగా విజయ్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగ మంత్రి జైశంకర్‌ తెలిపారు. 35ఏళ్ల విజయ్ బెంగళూరుకు చెందిన ఆక్సిప్లాంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. జనవరి 25న ఆన్ సైట్ ప్రాజెక్ట్ కింద టర్కీలోని మాలత్యకి వెళ్లాడు.