సౌతిండియన్ సెన్సేషన్ : 4 భాషల్లో విజయ్ ‘హీరో’ నిర్మాణం

సౌతిండియన్ సెన్సేషన్ : 4 భాషల్లో విజయ్ ‘హీరో’ నిర్మాణం

విజయ్ దేవరకొండ సౌతిండియన్ స్టార్ గా మారిపోయాడు. విజయ్ కి తెలుగుతో పాటు… తమిళ్, కన్నడ, మలయాళంలోనూ  మార్కెట్ పెరిగిపోయింది. ఇప్పటికే పలు సినిమాలు ప్రాంతీయ భాషల్లో విడుదలై కమర్షియల్ గా హిట్టయ్యాయి. ప్రస్తుతం రిలీజ్ కు రెడీ అయిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా కూడా తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో విడుదదల కానుంది. హీరో కమ్యూనిస్టు భావాలున్న స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నాడు. పాత్రకు ఉన్న విస్తృతమైన పరిధి కారణంగా.. సినిమాను పలు భాషల్లో విడుదల చేయాలని మూవీ మేకర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ నిర్ణయించింది. ఇందులో హీరోయిన్ రష్మిక మండన్నా తెలంగాణకు చెందిన క్రికెటర్ పాత్రలో నటిస్తోంది. మార్చి 17న డియర్ కామ్రేడ్ టీజర్ విడుదల కాబోతోంది.

ఇపుడు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విజయ్ దేవరకొండతో కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. ఈ కొత్త సినిమా పేరు “హీరో”. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే మరోసారి విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీని సౌత్ లోని అన్ని భాషల్లో రూపొందిస్తున్నామని షూటింగ్ ప్రారంభానికి ముందే నిర్మాతలు ప్రకటించారు. ఢిల్లీలో ఏప్రిల్ 22 నుంచి హీరో షూటింగ్ ప్రారంభం కానుంది.