బాలయ్య సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి!

బాలయ్య సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి!

బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అఖండ’. వీరిద్దరి కాంబినేషన్ అనగానే సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌‌బస్టర్స్ గుర్తొస్తాయి. ఆ రెండు చిత్రాల్లోని యాక్షన్ సీక్వెన్సులు, హీరో ఎలివేషన్ సీన్స్ కళ్లముందు కదలాడతాయి. ‘అఖండ’లో అంతకు మించిన యాక్షన్‌‌ని చూపించనున్నాడట బోయపాటి. ఈ మూవీ మేకింగ్‌‌లో దాదాపు సగం వర్కింగ్ డేస్‌‌ని ఈ యాక్షన్ సీన్స్‌‌కే కేటాయించినట్టు తెలుస్తోంది. ఎనభై రోజుల పాటు ఫైట్ సీన్స్ తీసినట్లు యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టంట్ శివ కూడా చెప్పాడు. దాంతో ‘అఖండ’పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక బాలకృష్ణ నెక్స్ట్ మూవీ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. ఇందులో విజయ్ సేతుపతి విలన్‌‌గా నటించబోతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదే నిజమైతే సైరా, ఉప్పెన చిత్రాల తర్వాత సేతుపతి నటించబోయే తెలుగు సినిమా ఇదే కానుంది. తనతో పాటు వరలక్ష్మీ శరత్​కుమార్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుంది. గోపీచంద్ గత చిత్రం ‘క్రాక్’లో వరలక్ష్మి నటించిన విషయం తెలిసిందే. ఇక ఫిమేల్​ లీడ్​గా పలువురు స్టార్ హీరోయిన్స్‌‌ పేర్లు పరిశీలిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌‌తో తీయబోయే ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలో రివీల్ చేయనున్నారు.