
తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి(Vijay thalapathy) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ లియో(Leo). సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj) తెరకెక్కించిన ఈ గ్యాంగ్ స్టర్ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. మొదటిరోజు ఏకంగా రూ.145 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. ఇప్పటివరకు రూ.550 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి విజయ్ కెరీరి లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
ఇక సినిమా విడుదలై 15 రోజులు అవుతుండటంతో లియో ఓటీటీ రిలీజ్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ముందుగా ఈ సినిమాను నవంబర్ 21న స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అనుకున్నదానికన్నా ముందుగానే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. నవంబర్ 16 నుండి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. దీంతో విజయ్ ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీలవుతున్నారు. మరి థియేటర్స్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచినా ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.