Vijay Varma: తమన్నాతో పెళ్లి ఎప్పుడు?..విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Vijay Varma: తమన్నాతో పెళ్లి ఎప్పుడు?..విజయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

నటి తమన్నా(Tamannaah) విజయ్ వర్మ(Vijay Varma) ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే ఈ పెళ్లి ఎప్పుడనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.

ఈ నేపథ్యంలోనే తమన్నాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారని విజయ్ వర్మను అభిమాని ఏమ‌ని ప్ర‌శ్నించారంటే..''కబ్ షాదీ కర్రే??!!! (మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు) అని అడిగారు..దానికి విజయ్ వర్మ రిప్లై ఇస్తూ.. ''ఇప్పటికే నా మేనకోడలు మా అమ్మను ప్రశ్నలు అడుగుతోంది (రెడ్ ఎమోజితో పాటు)..నేను పదే పదే హైదరాబాద్‌లో కూడా ఈ ప్ర‌శ్న‌ విన్నాను'' అని తనదైన శైలిలో ఛ‌మ‌త్క‌రించాడు. 

మొత్తానికి విజయ్ వర్మ మ‌రోసారి త‌మ‌న్నాతో త‌న పెళ్లి గురించి చాలా తెలివిగా దాట‌వేసే ప్రయత్నం చేశాడు. మరోసారి అభిమానుల ప్రశ్నలకు ఆశ్చర్యార్థకమైన సమాధానాలే దొరికాయి. మరి వీరి పెళ్ళికి  ఫ్యాన్స్ వార్తల్లో ముహుర్తాలు పెట్టేస్తున్నారు. అయితే.. ఈ జంట చెప్పే మూడు ముళ్ల ముచ్చట వినేదెప్పుడో మరి!

విజయ్ వర్మ సినిమాల విషయానికి వస్తే..డైరెక్టర్ సుధ కొంగర(Sudha Kongara) డైరెక్షన్ లో కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్యతో తెరకెక్కుతున్న (సూర్య43) మూవీలో విజయ్ వర్మ కీలక పాత్రలో నటిస్తున్నాడు.  అలాగే ప్రస్తుతం 'ఉల్ జలూల్ ఇష్క్‌'తో బిజీగా ఉన్నారు.

ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె రెండు తమిళ సినిమాలతోపాటు.. హిందీలో ఒక సినిమా చేస్తున్నారు. వాటిలో అరుణమని, వేద, స్ట్రీ2, భోలే చూడియన్, పోన్ ఒండ్రు కందెన సినిమాలున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vijay Varma (@itsvijayvarma)