విజయ్ వర్మకు ఆ హీరోయిన్తో పెళ్లైందా? మరి తమన్నా సంగతేంటి?

విజయ్ వర్మకు ఆ హీరోయిన్తో పెళ్లైందా? మరి తమన్నా సంగతేంటి?

మిల్కీ బ్యూటీ తమన్నా(Thamannaah) బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ(Vijay varma)కు ఇప్పటికే పెళ్లి అయిందా? దీనికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్.. ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తమన్నాకు ఎందుకు వచ్చింది? అలాంటి వాడు నీకు అవసరమా తమన్నా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజయ్ వర్మ పెళ్లి ఫోటో వెనుక పెద్ద కథే ఉంది. అదేంటంటే.. పెళ్లి ఫొటోలో  విజయ్ వర్మ పక్కన ఉంది మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్(Alia bhat). అవును.. విజయ్ వర్మ, ఆలియా కలిసి డార్లింగ్స్(Darlings) అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ వర్మకి భార్యగా ఆలియా నటించింది. ఈ మూవీ కోసం వీళ్లిద్దరి పెళ్లి ఫోటోను క్రియేట్ చేశారట మేకర్స్. 

ఇక ఈ ఫోటోను చూసి విజయ్ వర్మ అమ్మ కూడా షాకైందట. మాకు చెప్పకుండా పెళ్లి ఎప్పుడు చేసుకున్నావ్ అని అడిగిందట. ఇక విజయ్ వర్మ సినిమాల విషయానికి వస్తే..  ప్రస్తుతం విజయ్ తమన్నాతో కలిసి లస్ట్ స్టోరీస్2(Lust Stories) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.