
కామారెడ్డి టౌన్, వెలుగు : ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో బ్యాంకుల నుంచి పాడి గేదెల కొనుగోలుకోసం రైతులకు లోన్లు అందించనున్నట్లు కామారెడ్డి జిల్లా విజయ డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ నాగేశ్వర్ రావు తెలిపారు. శనివారం డెయిరీ ప్లాంట్‌లో మిల్క్ కలెక్షన్ సెంటర్ల ప్రెసిడెంట్లు, సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సబ్సిడీపై రైతులకు రూ.5 లక్షల వరకు లోన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. సూపర్ వైజర్ల ద్వారా రైతులు లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం డీడీ నాగేశ్వర్ రావు, సంఘ ప్రతినిధులు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిశారు. పాల ఉత్పత్తి దారుల సంఘం ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.