నా కూతురిపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు

నా కూతురిపై కావాలని ఆరోపణలు చేస్తున్నారు

సినీ నటి కరాటే కళ్యాణి నిన్నటి నుంచి కనిపించడం లేదని తన తల్లి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కూతురిపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. శ్రీకాంత్ రెడ్డి తన కూతురుపై అటాక్ చేస్తానని బెదించాడని చెప్పారు. కళ్యాణి, 5 నెలల పాప మౌక్తిక ను ఎవరు తీసుకెళ్ళారో తెలియడం లేదన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో పోలీసులే చెప్పాలన్నారు. చైల్డ్ వెల్ఫేర్ వారు తన ఇంటికి వచ్చి.. చిన్న పిల్లల్ని అక్రమంగా తీసుకొచ్చారా అని ప్రశ్నించారన్నారు. నిజానిజాలు వెల్ఫేర్ అధికారులకు చెప్పామన్నారు. కళ్యాణి వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు విజయలక్ష్మి.


కల్యాణి  తీసుకున్న దత్తత విషయంలో నోటీసులు ఇచ్చినట్టుగా హైద్రాబాద్ కలెక్టర్ శర్మన్ తెలిపారు. అయితే కరాటే కళ్యాణి నుండి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు. సోమవారం కలెక్టర్ శర్మన్ మీడియాతో మాట్లాడారు. కరాటే కళ్యాణి నుండి ఎలాంటి సమాధానం రాలేదన్నారు.  ఇవాళ మరో నోటీసు ఇస్తామని కలెక్టర్ తెలిపారు. 24 గంటల వరకు ఈ నోటీసులపై  స్పందించకపోతే కరాటే కళ్యాణిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. పిల్లలను దత్తత తీసుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయన్నారు. . దాని ప్రకారమే దత్తత తీసుకోవాల్సి ఉంటుందన్నారు. చట్టానికి విరుద్దంగా వెళ్తే మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని కలెక్టర్ తెలిపారు. 


కరాటే కళ్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు ఆదివారం  సోదాలు నిర్వహించారు. ఆమె ఇంట్లో ఉంటున్న చిన్నారి ఎవరన్న దానిపై ఆరా తీశారు. ఈ వ్యవహారంపై కరాటే కళ్యాణి తల్లి విజయలక్ష్మీ స్పందించారు. తాము ఏ తప్పు చేయలేదని చట్ట ప్రకారమే అమ్మాయిని దత్తత తీసుకున్నామని ఆమె తెలిపారు. 12 ఏళ్ల అబ్బాయిని కళ్యాణి పెంచుతోందన్నారు. ఇప్పుడు మరొక అమ్మాయిని పెంచుకుంటోందని విజయలక్ష్మీ తెలిపారు. డిసెంబర్ 25న పుట్టిన పాపను 28న ఇంటికి తీసుకొచ్చిందని అమ్మాయి పేరు మౌక్తిక అని ఆమె తెలిపారు. అబ్బాయిని శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చామని విజయలక్ష్మి చెప్పారు. 

 

మరిన్ని వార్తల కోసం : -
తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర!

98 ఏళ్ల ఈ బామ్మ ఎందరికో ఆదర్శం

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే..