
వైసీపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రతినిధిగా విజయసాయికి కేబినేట్ హోదా కల్పిస్తూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.