కిషన్ రెడ్డికి విజయశాంతి కౌంటర్

కిషన్ రెడ్డికి విజయశాంతి కౌంటర్

తెలంగాణ అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ప్రశ్నించిన కిషన్ రెడ్డికి కాంగ్రెస్ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. అసలు కాంగ్రెస్ ను  ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని  అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే అర్హత సోనియాకు ఉందని ట్వీట్ చేశారు.    అసలు రాష్ట్ర ఏర్పాటులో  బీజేపీ ప్రమేయం ఎక్కడుందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీని ఉద్యమ కారులు ఎప్పటికైనా గౌరవిస్తారని తెలిపారు. 

తెలంగాణ ఏర్పాటుపై బీజేపీ బాధ్యత తీసుకోకపోతే ఆనాడు.. యూపీఏ భాగస్వామ్య పక్షాలన్నింటిని ఒప్పించి,కాంగ్రెస్ కు రాజకీయంగా నష్టం జరిగినా తెలంగాణ ఏర్పాటుకు మొగ్గు చూపారని చెప్పారు. కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ను ప్రశ్నించే అర్హత లేదన్నారు.

జూన్ 2న జరిగే ప్రభుత్వ కార్యక్రమానికి రాజకీయ నేత అయిన సోనియాను  ఎలా ఆహ్వానిస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించిన సంగతి తెలిసిందే.. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది బలిదానాలకు సోనియా కారణమని ఆరోపించారు.