బీజేపీలో చేరిన విజయశాంతి..కేసీఆర్ పై విమర్శలు

బీజేపీలో చేరిన విజయశాంతి..కేసీఆర్ పై విమర్శలు

సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి తన సొంత గూటికి చేరారు.  విజయ శాంతి బీజేపీలో చేరారు. పార్టీ సీనియర్ నేత అరుణ్ సింగ్  విజయశాంతికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ఉన్నారు. అరుణ్ సింగ్ చేతుల మీదుగా పార్టీ సభ్యత్వ తీసుకున్నారు విజయ శాంతి. ఇవాళ(సోమవారం) సాయంత్రం విజయశాంతి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.

ఈ సందర్బంగా మాట్లాడిన విజయ శాంతి.. కేసీఆర్ తన కుటుంబమే ఉద్యమంలో ఉండాలనుకున్నారన్నారు. కేసీఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు.టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పటానికి బీజేపీ వచ్చిందన్నారు. ప్రజల కోసం పనిచేేసే వాళ్లు ఉండకూడదనే కేసీఆర్ ఆలోచన అన్నారు. 2023లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. అరాచక టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామన్నారు.