పోలీసుల అత్యుత్సాహం.. దుర్గగుడి టోల్ గేట్ దగ్గర భక్తులను అడ్డుకున్న పోలీసులు..

పోలీసుల అత్యుత్సాహం.. దుర్గగుడి టోల్ గేట్ దగ్గర భక్తులను అడ్డుకున్న పోలీసులు..

దసరా నవరాత్రి ఉత్సవాల్లో విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి  దుర్గగుడి టోల్​ గేట్​ దగ్గర భక్తులు ఆందోళన చేశారు.  ఈ రోజు( సెప్టెంబర్​ 25)  అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.  అయితే  శ్రీ అన్నపూర్ణా దేవి ని దర్శించుకొనేందుకు కొంతమంది భక్తులు సెప్టెంబర్​ 24 వ తేది రాత్రి 9.30 గంటలకు టోల్​ గేట్​ దగ్గరకు చేరుకున్నారు.   

టోల్​ గేట్​ దగ్గర భక్తులు పోలీసులు భక్తులను దర్శనానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసు వాహనాలతో ఎక్కువ మందిని తీసుకెళుతూ తమకు దర్శనం లేకుండా పోలీసులు భక్తులను అడ్డుకుంటున్నారని భర్తదులు ఆందోళన చేశారు. తమను అన్నపూర్ణాదేవిని దర్శించుకొనేందుకు అనుమతించాలని పోలీసులపై ఆగ్రహానికి గురిచేశారు.

రెండువేల మంది భక్తులను  టోల్ గెట్ వద్ద పోలీసులు నిలిసివేశారు.  దీంతో వారంతా కన్నీటి పర్యంతమయ్యారు.  పోలీసుల తీరుపట్ల ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంత మంది పోలీసులతో వాగ్వాదానికి దిగి, నిరసన తెలిపారు. టోల్​ గేట్ దగ్గర విధులు నిర్వహించే పోలీసులు పరుష పదజాలంతో భక్తులను విమర్శిస్తున్నారని పలువురు భక్తుల ఆవేదన వ్యక్తంచేశారు .