స్పై ఆపరేషన్స్‌‌‌‌ తో ఆకట్టుకున్న గోట్ ట్రైలర్..

స్పై ఆపరేషన్స్‌‌‌‌ తో ఆకట్టుకున్న గోట్ ట్రైలర్..

కోలీవుడ్ స్టార్ విజయ్‌‌‌‌కు టాలీవుడ్‌‌‌‌లోనూ స్పెషల్ ఇమేజ్ ఉంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటించిన ‘ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (గోట్) చిత్రం సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ క్రమంలో శనివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.  ఇందులో తండ్రీ కొడుకులుగా రెండు వేరియేషన్స్‌‌‌‌లో కనిపించి మెస్మరైజ్ చేశాడు విజయ్.  ‘ఇదొక కొత్త అసైన్‌‌‌‌మెంట్. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక  కొత్త లీడర్.

68 సక్సెస్‌‌‌‌ఫుల్ ఇంటర్నేషనల్ స్పై ఆపరేషన్స్’ అంటూ విజయ్ పాత్రను గురించి నటుడు  ప్రశాంత్  పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా పరిచయం చేయడం ఇంటరెస్టింగ్‌‌‌‌గా ఉంది.  యాక్షన్ మోడ్‌‌‌‌తో పాటు తనలోని కామెడీ యాంగిల్‌‌‌‌తోనూ విజయ్ ఆకట్టుకున్నాడు. మీనాక్షి చౌదరి,  ప్రియా భవానీ శంకర్ హీరోయిన్స్‌‌‌‌గా నటించగా,  జయరామ్, ప్రభుదేవా, స్నేహ, లైలా ముఖ్య పాత్రల్లో కనిపించారు.   యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. అర్చన కల్పతి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది.