తమిళ నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు

తమిళ నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు

తమిళ నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నై సాలిగ్రామం ఏరియాలో ఉన్న విజయ్ ఇంట్లో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. బాంబు ఫోన్ కాల్ రాగానే పోలీసులు సాలిగ్రామం ఏరియాకు వచ్చి విజయ్ తల్లిదండ్రులను అలర్ట్ చేశారు. ఇంట్లో తనిఖీలు చేశారు. సాలిగ్రామంలోని ఇంట్లో విజయ్ తల్లిదండ్రులు ఉంటున్నారు. భార్యాపిల్లలతో కలసి విజయ్ ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని మరో ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి దగ్గర సెక్యూరిటీ పెట్టారు. సైబర్ క్రైమ్ కింద కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోరూర్ ప్రాంతం నుంచి కాల్ వచ్చినట్టు ప్రాథమికంగా గుర్తించారు.