
వికారాబాద్, వెలుగు: పిల్లలు లేని దంపతులు చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఇటలీకి చెందిన దంపతులకు వికారాబాద్ శిశుగృహలో పెరుగుతున్న ఎనిమిదేళ్ల బాలుడిని దత్తత ఇస్తూ సంబంధిత ఉత్తర్వుల కాపీని మంగళవారం తన ఛాంబర్ లో అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా చట్టపరంగా దత్తత తీసుకోవాలన్నారు. ఇందుకోసం వికారాబాద్శిశుగృహలో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో జయసుధ, సీడబ్ల్యూసీ చైర్మన్ వెంకటేశం , బీఆర్బీ కో–ఆర్డినేటర్ కాంతారావు, డీసీపీవో శ్రీకాంత్, శిశు గృహ మేనేజర్ శోభారాణి తదితరులు పాల్గొన్నారు.