వికారాబాద్, వెలుగు: జిల్లాలో మొదటి విడత పంచాయతీ పోలింగ్ సాఫీగా జరిగేలా చూడాలని కలెక్టర్ ప్రతీక్జైన్ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్నుంచి మొదటి విడత ఎన్నికలు జరిగే 8 మండలాల ఎంపీడీవోలు, స్పెషల్ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పోలింగ్సిబ్బంది బుధవారం ఉదయం 8 గంటలకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత మెటీరియల్తీసుకొని చెక్చేసుకోవాలని చెప్పారు. అనంతరం పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, లైట్స్, సీటింగ్ అరేంజ్ మెంట్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వంటివి నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ర్యాండమైజేషన్ పూర్తి
మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ర్యాండమైజేషన్ ద్వారా గ్రామాలకు పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. ఈ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతీక్ జైన్, జనరల్ అబ్జర్వర్ షేక్ యాస్మిన్ బాషా పర్యవేక్షించారు. 8 మండలాల్లోని 262 గ్రామాలకు గానూ 37 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయని తెలిపారు.
మిగతా 225 జీపీలు, 1,912 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. 2,351 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 2,743 మంది ఏపీవోలను కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమాల్లో అడిషనల్కలెక్టర్ సుధీర్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఆర్వో మంగీ లాల్, డీపీవో జయసుధ, నోడల్ ఆఫీసర్లు సత్తార్, మాధవ రెడ్డి, డీఈవో రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు.

