
- కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి
పరిగి, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను సక్సెస్ చేయాలని కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు టి. రామ్మోహన్ రెడ్డి కోరారు. శనివారం పరిగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దీపావళి పండుగ రోజున రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో అడుగుపెట్టనుందన్నారు.
రాష్ట్రంలో 12 రోజులు ఈ యాత్ర కొనసాగుతుందని రామ్మోహన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల వారీగా పాదయాత్రలో కార్యకర్తలు, నాయకులు రాహుల్ గాంధీని కలిసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తనను రాష్ట్ర లాజిస్టిక్స్ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.