రోడ్డు వేయలే.. మళ్లీ ఎందుకొచ్చావ్..? మహేశ్​రెడ్డిని నిలదీసిన తండా వాసులు

రోడ్డు వేయలే.. మళ్లీ ఎందుకొచ్చావ్..? మహేశ్​రెడ్డిని నిలదీసిన తండా వాసులు

పరిగి, వెలుగు :  వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మైసమ్మ గడ్డ తండాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పరిగి బీఆర్ఎస్ అభ్యర్థి మహేశ్ రెడ్డికి తీవ్ర నిరసన సెగ తగిలింది. ‘ గతంలో మా తండాకు రోడ్డు వేస్తానని హామీ ఇచ్చారు. అయినా వేయలేదు. ఏం అభివృద్ధి చేయలేదు. మళ్లీ ఎందుకు వచ్చావ్ ’అంటూ తండా వాసులు ప్రశ్నిస్తూ ఆయనను నిలదీశారు. ఇదే తండాలో రోడ్డు వేయాలని గతంలో స్థానికులు ప్రశ్నించగా.. ప్రభుత్వ పథకాలు వదులుకుంటే వేయిస్తానంటూ అప్పట్లో ఎమ్మెల్యే మహేశ్​రెడ్డి అహంకార పూరితంగా సమాధానం ఇచ్చారు. 

ALSO READ: డీలిస్టింగ్​పై త్వరలో సెబీ బోర్డు డిస్కషన్ : మాధబి పూరి బుచ్​

దీంతో  ఆయన వ్యవహార శైలిపై స్థానికంగా రాజకీయ దుమారమే చెలరేగింది.  గత ఎన్నికలప్పుడు వచ్చి.. మళ్లీ ఇప్పుడు వచ్చావా అంటూ తండా వాసులు ఆయనను  ప్రశ్నించారు. మళ్లీ  రోడ్డు హామీపై ప్రశ్నించగా.. ‘మీరే రోడ్డు వేసి బిల్లు తీసుకోవాలని’ అంటూ వారికి మహేశ్ రెడ్డి సమాధానం చెప్పడంతో తండా వాసులు మండిపడ్డారు. దీంతో ఆయన ప్రచారం చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేను ప్రశ్నిస్తుండగా యువకులు వీడియోలు తీస్తుంటే.. వద్దంటూ ఎమ్మెల్యే గన్​మెన్​తో పాటు బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు.