డీలిస్టింగ్​పై త్వరలో సెబీ బోర్డు డిస్కషన్ : మాధబి పూరి బుచ్​

డీలిస్టింగ్​పై త్వరలో సెబీ బోర్డు డిస్కషన్ : మాధబి పూరి బుచ్​

ముంబై: డీలిస్టింగ్​ రూల్స్​లో మార్పులను త్వరలో జరిగే  బోర్డు మీటింగ్​లో చర్చించనున్నట్లు సెబీ చైర్​ పర్సన్​ మాధబి పూరి బుచ్​ గురువారం వెల్లడించారు. ఆ తర్వాత డిసెంబర్​, జనవరి నెలల్లో జరిగే మీటింగ్​లో ఇన్​సైడర్​ ట్రేడింగ్​ రూల్స్​ మార్పు అంశం సెబీ బోర్డు ముందుకు రానున్నట్లు తెలిపారు. 

ఫిక్కి నిర్వహించిన ఒక ఈవెంట్లో మాధబి పూరి బుచ్​ మాట్లాడారు. డీలిస్టింగ్​ రూల్స్​ను సెబీ మార్చదని కొంత మంది అనుకుంటున్నారని, అందులో నిజం లేదని చెబుతూ, ఈ అంశంపై ఒక కన్సల్టేషన్​ పేపర్​ రెడీ అయిందని బుచ్​ స్పష్టం చేశారు. త్వరలో జరిగే బోర్డు మీటింగ్​లో ఈ అంశం చర్చకు రానుందని వెల్లడించారు. ఇన్​సైడర్​ ట్రేడింగ్ రూల్స్​లోనూ బోర్డు మార్పులు తేనుందని చెప్పారు. 

ALSO READ: అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి పై దాడికి యత్నం

మార్పులు తేవడానికి ముందు డేటాను బ్యాక్​ టెస్టింగ్​ చేస్తున్నామని , సరైన డేటా ఎనాలిసిస్​ చేయకుండా రూల్స్​లో మార్పులను సెబీ తేవడం లేదన్నారు. ట్రేడింగ్​ ప్లాట్​ఫామ్స్​లో టెక్నికల్ ప్రోబ్లమ్స్​ ఎదురైనప్పుడు ఇన్వెస్టర్​ నేరుగా ఎక్స్చేంజ్​ వెబ్​సైట్​ను చేరుకోవచ్చన్నారు.