అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి పై దాడికి యత్నం

అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి పై దాడికి యత్నం

అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట కాంగ్రెస్  పార్టీ అభ్యర్థి డాక్టర్ వంశీకృష్ణ పై దాడికి యత్నించారు. ఈ ఘటన గురువారం రాత్రి  నాగర్​ కర్నూల్​ జిల్లా బల్మూర్  మండలం రాంనగర్  తండాలో జరిగింది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా  గురువారం రాత్రి రాంనగర్  తండాలో ప్రచారం నిర్వహిస్తున్న వంశీకృష్ణ పై గ్రామ సర్పంచ్  తమ్ముడు కృష్ణ.. రాయితో దాడి చేయడానికి యత్నించాడు. రాయి ఆయన వాహనానికి తగలడంతో ప్రమాదం తప్పింది. అక్కడే ఉన్న పోలీసులు కృష్ణను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు  తరలించారు. 

అనంతరం కాంగ్రెస్  నేతలు బల్మూర్  పోలీస్  స్టేషన్ లో కృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వంశీకృష్ణ స్పందించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదని, తాను నల్లమలలో పుట్టిన బిడ్డ అని ఆయన పేర్కొన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలు  తమపై దాడులకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు.