పంప్ హౌస్ వద్ద కోడి పందేలు..9 మంది అరెస్ట్

పంప్ హౌస్ వద్ద కోడి పందేలు..9 మంది అరెస్ట్
  • 2 కోళ్లు, 8 సెల్ ఫోన్లు, 16 వేలకుపైగా క్యాష్ స్వాధీనం

వికారాబాద్, వెలుగు : పంప్ హౌస్ వద్ద కోడి పందేలు నిర్వహిస్తున్న 9 మందిని వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం యాలాల మండలం బెన్నూర్ గ్రామ సమీపంలోని కాగ్నా వాగు పంప్ హౌస్ వద్ద కోడి పందేలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న వికారాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్  ఎస్సై ప్రశాంత్ వర్దన్ టీమ్  యాలాల ఏఎస్సై యాదయ్యతో కలిసి దాడులు చేసింది.

కోడి పందేలు నిర్వహిస్తున్న 9 మందిని అరెస్ట్ చేసింది. 2 కోళ్లు, 8 సెల్ ఫోన్లు, రూ.16 వేల 320 క్యాష్ ను స్వాధీనం చేసుకుంది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యాలాల పోలీసులు తెలిపారు.