దివ్యాంగులకు రుణాలు.. దరఖాస్తుల ఆహ్వానం

 దివ్యాంగులకు రుణాలు..  దరఖాస్తుల ఆహ్వానం

వికారాబాద్, వెలుగు: దివ్యాంగులు జీవనోపాధి పొందేందుకు ప్రభుత్వం ఉపాధి, పునరావాస పథకాన్ని అమలు చేస్తున్నదని వికారాబాద్ జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తెలిపారు. ఈ పథకం కింద జిల్లాకు బ్యాంకు లింకేజీ లేకుండా రూ.50 వేలతో 22 యూనిట్లు, బ్యాంకు లింకేజీతో రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షలతో ఒక్కో యూనిట్ మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. అభ్యర్థులు కనీసం 40 శాతం వైకల్యంతో 21 నుంచి-55 ఏండ్ల వయస్సు మధ్య ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షిక ఆదాయం ఉండాలని తెలిపారు.

అర్హులు ఈ  నెల 14 నుంచి 31 వరకు వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్​లో దరఖాస్తు చేయాలని సూచించారు. సదరం సర్టిఫికేట్, ఆధార్, ఆదాయ, కులం, నివాస, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లు, పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఫొటో జతచేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక ఆన్​లైన్​లో జరుగుతుందని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.