- కారు, ఆటో ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని రాకంచెర్ల సమీపంలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్‌స్పీడ్‌తో వచ్చిన కారు ఢీకొట్టడంతో ఆటో నుజ్జునుజ్జయ్యింది. ఆటోలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. కొడంగల్ మండలం పర్సాపూర్ తండాకు చెందిన కిష్టా నాయక్ సహా ఐదుగురు కుటుంబ సభ్యులు శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ పెండ్లికి వెళ్లి సాయంత్రం ఆటోలో తిరిగి వస్తున్నారు.
రాకంచెర్ల సమీపంలోకి రాగానే పరిగి నుంచి హైదరాబాద్ వైపు అతి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, స్థానికులు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
