
వికారాబాద్, వెలుగు: ఇటీవల వికారాబాద్ మండలంలోని సర్పన్‌పల్లి ప్రాజెక్ట్‌లో బోటు బోల్తా పడి ఇద్దరు మహిళా పర్యాటకులు మృతిచెందిన సంఘటనపై విచారణ వేగవంతం చేశారు. ఇందుకోసం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఏడుగురు అధికారులతో కమిటీ వేశారు. కమిటీలో ఇరిగేషన్ ఈఈ మధుసూదన్‌రెడ్డి, వికారాబాద్ ఆర్డీవో వాసుచంద్ర, వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ, జిల్లా స్పోర్ట్స్ అధికారి సత్తార్, సర్వే, ల్యాండ్ రికార్డ్ ఏడీ రాంరెడ్డి, జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ సదానందం, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ ఉన్నారు. కమిటీ సభ్యులు శుక్రవారం రిసార్ట్, సర్పన్ పల్లి ప్రాజెక్ట్‌ను సందర్శించి వివరాలు సేకరించారు.