ప్రజలకు అందుబాటులో ఉంటాం: వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి

ప్రజలకు అందుబాటులో ఉంటాం: వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ ఎస్పీగా నారాయణరెడ్డి జిల్లా పోలీస్ క్వార్టర్ లో  శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, డీటీసీ అడిషనల్ ఎస్పీ మురళీధర్ బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. కొత్త ఎస్పీకి ఏఆర్ పోలీస్ అధికారులు గౌరవ వందనం చేశారు.  

అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పని చేస్తామని, నేరాలపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని తెలిపారు. జిల్లాలోని పోలీసులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.

గంజాయి, డ్రగ్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి నియంత్రిస్తామని స్పష్టం చేశారు. యువత మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దని సూచించారు. గంజాయి అమ్మే వారిపై నిఘా పెట్టి కఠినమైన చర్యలు తీసుకుంటామని, ముందుస్తు సమాచారమందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. అనంతరం జిల్లాలోని డీఎస్పీలు, ఇన్ స్పెక్టర్లు కొత ఎస్పీని కలిసి విషెస్ చెప్పారు.

 వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తాండూర్ డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి, పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి, జిల్లా వర్టికల్ ఇన్ చార్జ్ డీఎస్పీ జానయ్య , ఏఆర్ డీఎస్పీ వీరేష్, ఇన్ స్పెక్టర్లు, సర్కిల్ ఇన్ స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.