
దుబాయ్ కు వెళ్లి బాధలు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే పలువురి విషయాల్లో ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అటు అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లు కల్పించుకుని బాధితులను భారత్ వచ్చేలా చేశారు. తాజాగా.. రాష్ట్రానికి చెందిన ఓ మహిళ తనను వెనక్కి తీసుకొచ్చేలా చేయండని తెలంగాణ ప్రభుత్వాన్ని వీడియో ద్వారా వేడుకుంది.
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల కు చెందిన సుమీనా ఉపాది కోసం రెండు నెలలకింద దుబాయ్ కు వెళ్లింది. అయితే వెళ్లినప్పటి నుంచి దుబాయ్ లో పనిచేయించుకునే వాళ్లు చాలా ఇబ్బందులు పెడుతున్నారని వీడియో ద్వారా తెలిపింది. దీంతో పాటు తన కొడుకు ఆరోగ్యం సరిగ్గా లేదంటూ చెప్తూ తనను వెనక్కి పిలుచుకోవాలని కోరింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని వేడుకుంది.