Vikram-32 chip: ఇస్రో మొట్టమొదటి స్వదేశీ చిప్ విక్రమ్ 32.. ఇదే దేనికిఉపయోగపడుతుంది?

Vikram-32 chip: ఇస్రో మొట్టమొదటి స్వదేశీ చిప్ విక్రమ్ 32.. ఇదే దేనికిఉపయోగపడుతుంది?

భారత్ తొలి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన 32-బిట్ ప్రాసెసర్ విక్రమ్-32ను ఆవిష్కరించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన సెమికాన్ ఇండియా 2025 సమావేశంలో ఎలక్ట్రానిక్స్ ,ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ మైక్రోచిప్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహుకరించారు. సెమీకండక్టర్ డెవలప్ మెంట్ లో దేశం చేస్తున్న కృషికి ఈ అభివృద్ధి కీలక మైలురాయిని సూచిస్తుంది.

విక్రమ్ -32 చిప్‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సెమీకండక్టర్ లాబొరేటరీ (SCL) అభివృద్ధి చేసింది. ఇది భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ మైక్రోప్రాసెసర్. పర్యావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేసేందుకు అధిక విశ్వసనీయతను కోరుకునే అంతరిక్ష ప్రయోగ వాహనాల కోసం ఈ చిప్ ను రూపొందించారు. 

PSLV-C60 మిషన్ లో..

2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఈ ప్రాసెసర్ ను తయారీ మొదలుపెట్టింది. దీనిని PSLV-C60 మిషన్ లో వినియోగించారు.కేవలం మూడున్నరేళ్లలో భారత్ అడ్వాన్స్ డ్ చిప్ వినియోగదారు నుంచి ఉత్పత్తి దారుగా ఎదిగింది. విక్రమ్ 32తయారీ, ప్యాకేజింగ్ పంజాబ్‌లోని మొహాలిలోని SCL 180nm CMOS జరుగుతోంది. 

ALSO READ : అమెరికాకు ఇండియా మరో షాక్..

విక్రమ్-32: టెక్నికల్ ఫీచర్లు.. 

విక్రమ్-32 ప్రాసెసర్ 32-బిట్ ఆర్కిటెక్చర్ ఉపయోగించి దశాంశాలతో గణనలతో సహా సంక్లిష్టమైన పనులను నిర్వహించేందుకు రూపొందించారు. ఇస్రో ప్రకారం..ఇది పెద్ద మెమరీని కలిగి ఉంటుంది. ఉపగ్రహ ప్రయోగాలు ,అంతరిక్ష వాహనాలకు అవసరమైన లేటెస్ట్ సూచనలు ఇవ్వగలదు. 

కఠినమైన అంతరిక్ష పరిస్థితులను తట్టుకునేలా రూపొందించబడిన ఈ చిప్ అంతరిక్ష అనువర్తనాలకు మించి సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీని దృఢమైన డిజైన్ రక్షణ, అంతరిక్షం, ఆటోమోటివ్ ,ఇంధన రంగాలలో ఉపయోగించేందుకు అనుకూలంగా ఉంటుంది.

ఢిల్లీలో మూడు రోజుల సెమికాన్ ఇండియా సమావేశం పెరుగుతున్న సెమీకండక్టర్  రంగంలో భారత్ సామర్థ్యాలకు నిదర్శనం. విక్రమ్-32 చిప్‌ను కేంద్రంగా చేసుకుని, బలమైన, స్థిరమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై భారత్ దృష్టి సారిస్తోంది.