అమెరికాకు ఇండియా మరో షాక్.. రష్యా నుంచి మరిన్ని S-400 మిస్సైళ్లు

అమెరికాకు ఇండియా మరో షాక్.. రష్యా నుంచి మరిన్ని S-400 మిస్సైళ్లు

టారిఫ్స్ పేరున ఇండియాను భయపెట్టి, ఒత్తిడి తెచ్చి.. తక్కువ ట్కాక్స్ లకే తమ ఉత్పత్తులు ఇండియాకు ఎగుమతి చేసుకోవాలన్న అమెరికా వేసిన ఎత్తులు దాదాపు చిత్తై పోయినట్లు కనిపిస్తోంది. ప్రపంచంలోనే జనాభాలో రెండో అతిపెద్ద దేశం అయిన ఇండియాలో తమ ఉత్పత్తులను భారీగా డంప్ చేసి కోట్ల డాలర్లు కొల్లగొట్టాలన్న పన్నాగం పారడం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గని ఇండియా.. ఇటు రష్యా, చైనా వంటి దేశాలకు దగ్గరైంది. SCO సమ్మిట్ లో ఈ అగ్రదేశాధి నేతల కలయిక.. యూఎస్ అంతర్మథనంలో పడేలా చేసింది. 

రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలును ఆపాలన్న ఆంక్షలను పట్టించుకోని ఇండియా.. ఇప్పుడు అమెరికాకు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.  రష్యా నుంచి మరిన్ని S-400 మిస్సైల్స్ కొనుగోలు చేసుందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియాకు అదనంగా మిస్సైళ్లను సప్లై చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు రష్యా రక్షణ శాఖ అధికారులు ఆ దేశ ఏజెన్సీకి (TASS) స్పష్టం చేశారు. ఇండియా ఇప్పటికే S-400 మిస్సైల్స్ వినియోగిస్తోందని.. కొత్త మిస్సైల్స్ కోసం చర్చలు జరుగుతున్నాయని రష్యా మిలిటరీ, టెక్నికల్ కార్పోరేషన్ చీఫ్ దిమిత్రీ షుగయేవ్ తెలిపారు.

ALSO READ : సెమీకండక్టర్ మార్కెట్‌‌లో సత్తా చాటుతాం

ఇండియా 2018లో రష్యాతో 5.5 బిలియన్ డాలర్ల S-400 మిస్సైల్స్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. చైనా పెంచుకుంటున్న మిలిటరీ పవర్ కు కౌంటర్ ఇచ్చేందుకు ఇండియా అప్పట్లో వ్యూహాత్మక ఒప్పందాన్ని రష్యాతో చేసుకుంది. అయితే ఈ డీల్ మధ్య మధ్యలో డిలే అవుతూ వస్తోంది. 2026-27 లో రెండు యూనిట్లు డెలివరీ చేయాల్సి ఉంది. ఇప్పుడు మరిన్ని యూనిట్ల కోసం చర్చలు కొనసాగిండచం అమెరికాకు మింగుడుపడని విషయం కావచ్చు. 

ఇక భారత ఆయుధ సంసత్తిని పెంచుకునేందుకు ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాలతో ఒప్పందాలు కొనసాగుతున్నాయి. రష్యా కూడా మొదటి నుంచి ఇండియాకు కీలక పార్టనర్ గా ఉంది. అత్యధిక ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశంగా రష్యా ఉంది. 2020 నుంచి 2024 మధ్య భారత్ కొనుగోలు చేసిన ఆయధ సామాగ్రి 36 శాతం రష్యా నుంచే కావడం గమనార్హం.