ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోండి : విక్రమ్ గౌడ్ 

 ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోండి : విక్రమ్ గౌడ్ 
  • హెల్త్ డైరెక్టర్ కు వినతి పత్రం అందజేత

ముషీరాబాద్,వెలుగు : నకిలీ పత్రాలతో పర్మిషన్లు తీసుకుంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలు తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ డిమాండ్ చేశారు. హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ ను బుధవారం ఆఫీసులో బుధవారం విక్రమ్ గౌడ్ బృందం కలిసి వినతి పత్రం అందజేశారు.  ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అక్రమ హాస్పిటల్స్ పై తనిఖీలు చేపట్టాలని కోరారు.

అనంతరం విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతూ లక్షల్లో దండుకుంటూ ప్రైవేట్ హాస్పిటల్ వ్యవస్థను మాఫియాగా మార్చారని మండిపడ్డారు.  జ్వరం వస్తే వందల టెస్టులు మందులు రాసి ప్రజల జేబులను గుల్ల చేసే అక్రమ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. సామర్థ్యం లేని భవనాల్లో కొనసాగుతున్న హాస్పిటల్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హెల్త్ డైరెక్టర్ ను కలిసిన వారిలో నరసింహ నాయక్, జాజుల లింగయ్య, ఈడిగ శ్రీనివాస్ ఉన్నారు.