
Vikram Solar IPO: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. ప్రస్తుతం గడచిన రెండు వారాలుగా ఈక్విటీ మార్కెట్లలో ఓలటాలిటీ అధికంగానే కొనసాగుతుంది. ఇన్వెస్టర్లు యూఎస్ డేటాతో పాటు రష్యా అమెరికా చర్చల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చాలా మంది ఈ కాలంలో మార్కెట్లకు కొంత దూరంగా ఉంటూ మంచి ఐపీవోలపై బెట్ వేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో రిటైల్ ఇన్వెస్టర్ల కంటే నాన్ ఇన్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచే ఇటీవలి కాలంలో ఐపీవోలకు ఎక్కువగా డిమాండ్ కనిపిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది విక్రమ్ సోలార్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి రూ.2వేల 079కోట్ల 37లక్షలు సమీకరించే లక్ష్యంతో మార్కెట్లోకి వస్తోంది. ఇందులో కేవలం రూ.15 వందల కోట్లకు మాత్రమే తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. మిగిలినది ఆఫర్ ఫర్ సేల్ రూపంలో అమ్మాలని కంపెనీ నిర్ణయించింది. రిటైల్ పెట్టుబడిదారుల కోసం ఐపీవో ఇష్యూ ఆగస్టు 19 నుంచి ఆగస్టు 21 వరకు ఓపెన్ చేయబడనుంది. అలాగే మార్కెట్లోకి ఐపీవో లిస్టింగ్ ఆగస్టు 26న ఉండబోతోంది.
కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను షేరుకు రూ.315 నుంచి రూ.332గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 45 షేర్లుగా ఉంచటంతో ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కొనుగోలుకు రూ.14వేల 175 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది. అలాగే కంపెనీ తన ఉద్యోగులకు రూ.2లక్షల వరకు చేసే పెట్టుబడిపై డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తోంది. అయితే ఐపీవో ప్రారంభానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ కారణంగా గ్రేమార్కెట్లో ఐపీవో మంచి స్పందనను చూస్తోంది. ప్రస్తుతం ఒక్కో షేరుపై రూ.69 ప్రీమియం పలుకుతోంది. అంటే ఇది లిస్టింగ్ రోజువరుకు ఇలాగే కొనసాగితే కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.401 వద్ద లాభంతో లిస్ట్ అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు.
కంపెనీ వ్యాపారం..
2005లో స్థాపించబడిన విక్రమ్ సోలార్ ప్రధానంగా ఫొటో ఓల్టాయిక్ సోలార్ ప్యానెల్స్ తయారీ వ్యాపారంలో ఉంది. కంపెనీ దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు తన ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. కంపెనీ సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం, ఇంజనీరింగ్ సేవలను కూడా అందిస్తోంది. అలాగే ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కూడా చూసుకుంటుంది.