Chiyaan 64: ఇంట్రెస్టింగ్ కాంబో.. ‘సత్యం సుందరం’ డైరెక్టర్‌‌‌‌తో విక్రమ్ మూవీ

Chiyaan 64: ఇంట్రెస్టింగ్ కాంబో.. ‘సత్యం సుందరం’ డైరెక్టర్‌‌‌‌తో విక్రమ్ మూవీ

కోలీవుడ్ స్టార్ విక్రమ్ కొత్త చిత్రాన్ని బుధవారం ప్రకటించారు. ‘96’ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యాన‌‌ర్‌‌పై ఇషారి గ‌‌ణేష్, కుష్మితా గ‌‌ణేష్ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌‌కు వెళ్లబోతోందని నిర్మాతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు విక్రమ్‌‌ను కలిసిన ఫొటోలను విడుదల చేశారు.  ఇక విజయ్ సేతుపతి, త్రిష జంటగా ప్రేమ్‌‌ తెరకెక్కించిన ‘96’సినిమాకు తెలుగులో హ్యూజ్ ఫ్యాన్‌‌ ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత ఇదే సినిమా ‘జాను’గా తెలుగులో రీమేక్ అయింది.

గత ఏడాది కార్తి, అరవింద్ స్వామి కాంబినేషన్‌‌లో ‘సత్యం సుందరం’అనే మరో చిత్రం తీశాడు. తక్కువ చిత్రాలే తెరకెక్కించినా ప్రేక్షకుల మనసులకు హత్తుకునే కథ,  కథనాలతో ఫీల్ గుడ్ డైరెక్టర్‌‌‌‌గా మెప్పించాడు. అలాంటి దర్శకుడు.. ఇప్పుడు విక్రమ్‌‌తో ఎలాంటి సినిమా చేయబోతున్నాడా అనే ఆసక్తి నెలకొంది.