హృతిక్‌ , సైఫ్‌ అలీ అదిరిపోయే ట్విస్టులు 

హృతిక్‌ , సైఫ్‌ అలీ అదిరిపోయే ట్విస్టులు 

పుష్కర్  గాయత్రి దర్శకత్వంలో  స్టార్‌ హీరోలు హృతిక్‌ రోషన్, సైఫ్‌ అలీఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘విక్రమ్‌ వేద’. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 30న గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌డానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, టీ సిరీస్‌తో వై నాట్ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాను శశికాంత్, భూషణ్ కుమార్‌లు నిర్మించారు.  ప్రమోషన్స్ లో భాగంగా బుధ‌వారం ఈ మూవీ టీజ‌ర్‌ను యూనిట్ విడుద‌ల చేసింది.  పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా సైఫ్‌, గ్యాంగ్‌ స్టర్‌గా హృతిక్‌ అదరగొట్టేలా నటించారు. విజువల్స్‌కు అనుగుణంగా సాగిన బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ తో టీజర్‌ను బాగానే కట్ చేశారు.

విక్రమ్ వేద కధలో ట్విస్ట్‌లు, మలుపులు ఎక్కువే. ఒక ముఖ్యమైన పోలీసు ఆఫీసర్ పాత్రలో సైఫ్ అలీఖాన్ కన్పిస్తే..భయంకరమైన గ్యాంగ్‌స్టర్ గా హృతిక్ కన్పించాడు. ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటం, వేట కధలో అనేక మలుపులకు దారి తీస్తున్నట్లు తెలుస్తుంది. 1 నిమిషం 46 సెకన్ల టీజర్‌లో ఆకట్టుకునే డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్  ఉన్నాయి.  అయితే ఒరిజినల్ వెర్షన్ సినిమా చూసిన వాళ్లకు హిందీ వెర్షన్ టీజర్‌ అంతగా ఆకట్టుకోదు.  తమిళంలో విజయ్ సేతుపతి, మాధవన్ ముఖ్యపాత్రలు పోషించిన  ఈ మూవీ అక్కడ సూపర్ హిట్టైయింది. విక్రమార్కుడు, బేతాళుడు కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులో రీమేక్ చేసే ఆలోచనలో  ఉన్నారట.