అమ్మాయిలు జీన్స్ తొడుక్కోవద్దంటూ తీర్మాణం

అమ్మాయిలు జీన్స్ తొడుక్కోవద్దంటూ తీర్మాణం
  • ఉత్తరప్రదేశ్ ముజఫర్‌నగర్‌లో ఖాప్ పంచాయతీ తీర్మానం 

ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్లోని ఖాప్ పంచాయతీ కొత్త తీర్మానం చేసింది. ఇకపై అమ్మాయిలు జీన్స్ ధరించవద్దని ఆదేశించింది. ఈ కట్టుబాట్లు ఉల్లంఘించిన వారిపై సంఘ బహిష్కరణ విధిస్తామని హెచ్చరించారు. అలాగే, అబ్బాయిలు నిక్కర్లు వేసుకోవద్దని, వేసుకున్న వారికి ఫైన్ వేస్తామని ఖాప్ పంచాయతీ స్పష్టం చేసింది. అమ్మాయిలు జీన్స్ వేసుకోవడం వల్ల వేధింపులు ఎక్కువవుతున్నాయని పంచాయతీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మాయిలు, అబ్బాయిలు మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా బట్టలు వేసుకోవాలని సూచించారు. జీన్స్, నిక్కర్ల వెస్టర్న్ కల్చర్ వద్దని చీరలు, గాగ్రా, సల్వార్ కమీజ్ ధరించాలని చెప్పారు. అలాగే, వచ్చే పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని ఉత్తరప్రదేశ్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా పంచాయతీ పెద్దలు ఖండించారు.