చౌటుప్పల్ టౌన్లో నిండిన ఊర చెరువు.. మునిగిన RDO, MPDO కార్యాలయాలు !

చౌటుప్పల్ టౌన్లో నిండిన ఊర చెరువు..  మునిగిన RDO, MPDO కార్యాలయాలు !

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షాలకు చెరువు కుంటలు నిండిపోయాయి. చౌటుప్పల్ మునిసిపాలిటీ కేంద్రంలో ఊర చెరువు నిండటంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. మంగళవారం (నవంబర్ 04) చెరవు అలుగు నీళ్లతో RDO,  MPDO కార్యాలయం నీట మునిగింది. దీంతో సిబ్బంది ఫైల్స్, కంప్యూటర్లను ఫస్ట్ ఫ్లోర్కు తరలించారు.

మరోవైపు అలుగు నీరు భారీగా వస్తుండటంతో లోతట్టు ప్రాంతాలలోకి నీళ్లు వచ్చిచేరాయి. 13వ వార్డు వినాయక నగర్ కాలనీలో ఇండ్లలోకి  వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో ఆర్డీవో, ఎంపీడీవో ఆఫీస్ లు, పాల కేంద్రం, టీటీడీ ఫంక్షన్ హల్ లాంటి స్థలాలు నీట మునిగాయి.