నర్వ మండలం లంకాల గ్రామంలో..మట్టి టిప్పర్ను అడ్డుకున్న గ్రామస్తులు

నర్వ మండలం లంకాల గ్రామంలో..మట్టి టిప్పర్ను అడ్డుకున్న గ్రామస్తులు

నర్వ, వెలుగు: అనుమతి లేకుండా టిప్పర్లతో అక్రమంగా మట్టిని తరలిస్తుండగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. నర్వ మండలం లంకాల గ్రామంలోని సంగంబండ డీ14 కాలువ మట్టిని తరలిస్తుండగా, గ్రామస్తులు అడ్డుకొని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మట్టి మాఫియాపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

మరికల్ మండలం కన్మనూర్  గ్రామానికి చెందిన రంజిత్ రెడ్డి అనుమతులు లేకుండా టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. మట్టి తరలింపును అరికట్టాలని గ్రామస్తులు కోరారు. విజయ్, శ్రీధర్ శెట్టి, కృష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తిరుపతయ్య, డీకే జనార్ధన్, కురువ విజయ్, గోవిందు పాల్గొన్నారు.