
రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్ రాష్ట్రం కేదార్‌నాథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జగ్గి బగ్వాన్, చిలాండ్ గ్రామాల ప్రజలు సోమవారం జరిగి న పోలింగ్‌ను బ్యాన్ చేశారు. చాలాకాలంగా అడుగుతున్నా వాళ్ల గ్రామాలకు రోడ్డు వేయలేదనే కారణంతో ఓటేయ్యలేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు వచ్చి ఓటు వేయడానికి రావాలని విజ్ఞప్తి చేసినా ప్రజలు అంగీకరించలేదు. చిలాండ్ గ్రామంలో225 మంది, జగ్గి బగ్వాన్ గ్రామంలో 376 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్‌ను బ్యాన్ చేయాలని తీసుకున్న డెసిషన్‌ను మార్చుకోవాలని అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, చీఫ్ డెవలప్‌మెంట్‌ఆఫీసర్ గ్రామస్థులను కోరారు. అయితే, వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేది లేదని వాళ్లు తేల్చి చెప్పారు. దీంతో ఆ రెండు గ్రామాల నుంచి ఒక్కరు కూడా ఓటు వేయలేదు.