సంతకైనా.. ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇవే తిప్పలు

సంతకైనా.. ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇవే తిప్పలు

వారసంతకు పోయి సరుకులు తెచ్చుకోవాలన్నా, అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లాలన్నా ఇలా ప్రమాదకరంగా  వాగు దాటాల్సిందే. బజార్ హత్నూర్ మండలంలోని బంద్రేవ్ వాగు వానాకాలంలో పొంగి పొర్లుతూ ఉంటుంది. ఆ వాగు దాటలేని స్థితిలో కొత్తపల్లి గ్రామస్తులు వానాకాలం పూర్తయ్యే వరకు ఇంకో ఊరికి పోకుండా తండాలోనే ఉంటారు. 

తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే వాగు దాటాల్సిందే. మండల కేంద్రంలో గురువారం జరిగిన వారసంతకు ఇలా ప్రమాదకరంగా వాగు దాటి సరుకులు కొనుక్కొని తిరుగుముఖం పట్టారు. ఆఫీసర్లు ఈ వాగుపై వంతెన నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.   - బజార్ హత్నూర్, వెలుగు