ఏం ఒరగబెట్టారని ఓట్లకు వచ్చిన్రు 

ఏం ఒరగబెట్టారని ఓట్లకు వచ్చిన్రు 

గద్వాల, వెలుగు: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం మునగాల గ్రామస్తులు వాపోయారు. ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన అలంపూర్​బీఆర్ఎస్​అభ్యర్థి విజయుడుని అడ్డుకున్నారు. బీఆర్ఎస్​వాళ్లకు మునగాలలో ఓట్లు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. ఎన్నికల టైంలో తప్ప అధికార పార్టీ లీడర్లు గ్రామం వైపు కన్నెత్తి చూడడం లేదన్నారు.

గ్రామానికి, అలంపూర్​నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని చెప్పి, కొన్నేండ్లుగా బర్రెలు, గొర్రెలు కాసుకునేలా చేశారన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్​పార్టీకి తగిన బుద్ధి చెబితేనే, అలంపూర్​బాగుపడేదన్నారు. దీంతో బీఆర్ఎస్ లీడర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.