లింగంపేట మండల కేంద్రంలో మటన్ ధరలు పెంచారని నిరసన

లింగంపేట  మండల కేంద్రంలో  మటన్ ధరలు పెంచారని నిరసన

లింగంపేట, వెలుగు : మండల కేంద్రంలో మటన్ ధరలు పెంచారని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.  కిలోకు రూ.2 వందల రేటు పెంచారని ఆరోపించారు. తాడ్వాయి, గాంధారి మండలాల్లో మేక మాంసం కిలో రూ.6 వందలకు విక్రయిస్తుండగా లింగంపేటలో రూ.8 వందలకు అమ్ముతున్నారన్నారు. పొట్టేలు మాంసం కిలోకు రూ.7 వందలకు విక్రయి స్తుండగా లింగంపేటలో రూ.9 వందలకు అమ్ముతున్నారన్నారు. 

అనారోగ్యం బారిన పడిన మేకలు, గొర్రెల మాంసాన్ని విక్రయిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం జేశారు.  ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.