
బషీర్బాగ్, వెలుగు: ఏటా నిర్వహించే బహుజన బతుకమ్మను ఊరూరా ఉద్యమంగా నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క తెలిపారు. శనివారం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు లోని అమరవీరుల స్థూపం వద్ద పలువురు మహిళలతో కలిసి విమలక్క బతుకమ్మ ఆడారు.
పర్యావరణాన్ని కాపాడుకోవడానికి బహుజన బతుకమ్మను ఈ నెల 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద బహుజన బతుకమ్మ ను ప్రారభించి.. అన్ని జిల్లాలకు తిరుగుతామన్నారు. ఆ దిశగా బహుజన బతుకమ్మ బస్సు యాత్ర కొనసాగుతుందని చెప్పారు.