
హైదరాబాద్, వెలుగు : లైఫ్‌సైన్సెస్ కాంట్రాక్ట్ రీసెర్చ్, టెస్టింగ్ సంస్థ విమ్టా ల్యాబ్స్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ టెస్టింగ్, సర్టిఫికేషన్సేవల విభాగంలోకి వచ్చింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ఈఎంఐ/ఈఎంసీ ల్యాబ్‌ను హైదరాబాద్ జినోమ్‌వ్యాలీలోని నియోవాంటేజ్ పార్క్ వద్ద మొదలుపెట్టింది. ఈ సదుపాయాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ల్యాబ్‌లో అత్యాధునిక, అత్యంత క్లిష్టమైన టెస్టులు చేయవచ్చు. ఇది మెడికల్, రక్షణ, ఏవియానిక్స్, టెలికామ్, వైర్ లెస్, ఆటోమొబైల్, ఇతర పారిశ్రామిక రంగాల ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ మాన్యుఫాక్చరింగ్ (ఈఎస్‌డీఎం) అవసరాలను తీరుస్తుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘‘ లైఫ్‌సైన్సెస్‌కు సంబంధించి అంతర్జాతీయంగా శక్తివంతమైన కేంద్రంగా వెలుగొందుతున్న జినోమ్‌వ్యాలీలో విమ్టా ల్యాబ్స్ ఈఎంఐ/ఈఎంసీ టెస్టింగ్ కేంద్రం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. జినోమ్ వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలను ఈ ఫెసిలిటీ ఉపయోగించుకుంటుంది’’అని అన్నారు. ఈ సందర్భంగా విమ్టా ల్యాబ్స్ ఛైర్మన్ డాక్టర్ ఎస్ పీ వాసిరెడ్డి మాట్లాడుతూ ‘‘నాణ్యత అనేది అత్యంత కీలకం. దీనిపై ఫోకస్‌చేస్తూ విమ్టా తమ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆహారం, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలలోనూ ఉత్పత్తి, అభివృద్ధి ప్రమాణాలకు విమ్టా మద్దతును అందిస్తుంది. ఇందుకోసం తగిన ఇకోసిస్టమ్‌ను నిర్మిస్తాం. కొన్ని సంవత్సరాలుగా భారతీయ ఈఎస్‌డీఎం రంగం గణనీయంగా వృద్ధి చెందడంతో పాటుగా ప్రాథమిక పరీక్షలదశ నుంచి ఉత్పత్తి, అభివృద్ది, ఒరిజినల్ డిజైన్ తయారీవైపు దృష్టి సారించింది. లైఫ్‌సైన్సెస్ బయోమెడికల్ పరిశ్రమలలో కచ్చితమైన పరీక్షల కోసం పెరుగుతున్న అవసరాలను తీర్చుతాం. అత్యాధునిక సెమీ–అనెకోయిక్ ల్యాబ్ ఇప్పుడు ఇండియాను ఈఎంసీ టెస్టింగ్ పరంగా గ్లోబల్ లీడర్‌గా మార్చనుంది’’అని అన్నారు. విమ్టా ల్యాబ్స్ ఎండీ హరిత వాసిరెడ్డి మాట్లాడుతూ ‘‘రక్షణ, ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్ తదితర రంగాలలో మేక్ ఇన్ ఇండియా కీలకంగా మారింది. ఈ మిషన్‌కు మద్దతును అందించేందుకు ప్రపంచస్థాయి టెస్టింగ్ ల్యాబ్ కావాలని గుర్తించాం. మేం ఈఎంటీఏసీ లేబరేటరీలను 2020లో సొంతం చేసుకోవడంతో పాటుగా ఈ పరిశ్రమలకు సర్వీస్ ఆఫరింగ్స్‌ను అందిస్తున్నాం. లేబరేటరీ వ్యాపారంలో మాకు అపార అనుభవం ఉంది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పరీక్షా సదుపాయాలను పూర్తిస్థాయిలో అందించడానికి కట్టుబడి ఉన్నాం. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పనిచేస్తాం. రాబోయే ఐదు సంవత్సరాలలో 70 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెడతాం’’ అని ఆమె వివరించారు.
మరో రెండు ప్రాజెక్టుల ప్రారంభం
జినోమ్ వ్యాలీలోనే లైఫ్‌సైన్సెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్లస్టర్ డెవలపర్స్ ‘ఆర్‌ఎక్స్ ప్రొపెల్లంట్’ నిర్మించిన ల్యాబ్‌తోపాటు మరో రెండు ప్రాజెక్టులను కేటీఆర్ప్రారంభించారు. ఆర్‌ఎక్స్ ల్యాబ్‌ను తొమ్మిది లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. రెండు కొత్త ప్రాజెక్ట్‌లు బీ–హబ్, జీవీ1లకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ప్రస్తుత ప్రాజెక్టుల రెండవ దశ కోసం భూమి పూజ చేశారు. ఆర్‌ఎక్స్ ప్రొపెల్లంట్ జినోమ్‌వ్యాలీలో ఇప్పటికే ఐదు లక్షల చదరపు అడుగుల్లో ల్యాబ్‌ను నిర్మించింది. లైఫ్‌సైన్సెస్ సెక్టార్‌కు చెందిన పలు పెద్ద కంపెనీలు ఇక్కడ తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఆర్‌ఎక్స్ ప్రొపెల్లంట్ జినోమ్ వ్యాలీ వద్ద ఇన్నోపోలిస్, టచ్‌స్టోన్, ఏఆర్‌ఎక్స్, నెక్ట్సోపోలిస్, జీవీ1, బీ–హబ్ ప్రాజెక్టుల కోసం ప్లాన్లను రెడీ చేసింది. ఇవి 17లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ ‘‘జినోమ్‌వ్యాలీ సాధించిన మరో మైలురాయిలో నేను కూడా భాగం కావడం సంతోషంగా ఉంది. ఆసియాలో అత్యంత శక్తివంతమైన లైఫ్‌సైన్సెస్ క్లస్టర్ జినోమ్ వ్యాలీ. ఈ ప్రాజెక్ట్ ఆర్ అండ్ డీ ఎకోసిస్టమ్‌ను మరింతగా పెంపొందించడంతో పాటుగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తుంది. స్థానికులకు ఉపాధి అవకాశాలను సైతం అందించనుంది. తెలంగాణలో 800కు పైగా లైఫ్‌సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి. ఈ తరహా పెట్టుబడులు కంపెనీలు వేగవంతంగా వృద్ధి చెందేందుకు తోడ్పడటంతో పాటుగా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి సైతం గణనీయంగా ఉపయోగపడతాయి’’ అని అన్నారు. అత్యంత కీలకమైన ప్రాజెక్ట్‌లలో బీ–హబ్ కూడా ఒకటని కంపెనీ తెలిపింది. ఇది బయోఫార్మా యాక్సిలరేటర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో జినోమ్‌వ్యాలీలో పరిశోధనలు మరింతగా పెంచేందుకు దీనిని నిర్మిస్తున్నారు. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న బీ–హబ్ పూర్తి స్థాయి కార్యకలాపాలు నిర్వహిస్తోన్న బయోఫార్మా సంస్థ. ఇక్కడ తయారీ కార్యక్రమాలను కూడా విస్తరిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సైన్సెస్ –ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే లైఫ్‌సైన్సెస్ కంపెనీలకు అత్యున్నత నాణ్యత కలిగిన టర్న్‌కీ ఆర్ అండ్ డీ లేబరేటరీలు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీలు, ఇన్‌క్యుబేషన్ కేంద్రాలు, వేర్‌హౌసింగ్ పార్క్‌లను ప్లగ్ అండ్ ప్లే విధానంలో అందుబాటులోకి తీసుకురావానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనివల్ల జినోమ్ వ్యాలీ క్లస్టర్‌కు ఎంతో మేలు జరుగుతుంది’’ అని అన్నారు. ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ సీఈఓ మిలింద్ రవి మాట్లాడూ ‘‘ హైదరాబాద్‌లో ఆర్‌ఎక్స్ ప్రొపెల్లంట్ ల్యాబ్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా కెటీఆర్ దీనిలో పాల్గొనడం మరింత సంతోషం కలిగించింది. భారతదేశంలో ఆర్ అండ్‌డీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మా సంస్థ గణనీయమైన మార్పులను తీసుకువచ్చింది. భారతదేశపు లైఫ్ సైన్సెస్ పరిశ్రమ అంతర్జాతీయ ఆర్ అండ్ డీ కేంద్రాలకు ధీటుగా ఉంది’’ అని అన్నారు. ప్రస్తుత లైఫ్ సైన్సెస్ మౌలికసదుపాయాల కోసం ఈ కంపెనీ 900 కోట్ల రూపాయల పెట్టుబడులను ఖర్చు చేయడంతో పాటుగా మరో రూ.రెండువేల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది.