అయ్యో..గణేశా.. షార్ట్ సర్క్యూట్ తో మండపం దగ్ధం

అయ్యో..గణేశా.. షార్ట్ సర్క్యూట్ తో మండపం దగ్ధం

ఎల్బీనగర్, వెలుగు: విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించి మండపం మొత్తం స్పెషల్​గా దూదితో అలంకరించారు. కొద్ది క్షణాల్లో పూజలు చేద్దామని అనుకున్నారు. అంతలోనే షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకొని మండపం పూర్తిగా దగ్ధమైంది. 

శనివారం పండగపూట దిల్ సుఖ్ నగర్ పీఅండ్ టీ కాలనీలో ఈ ఘటన జరిగింది. మండపం అగ్నికి ఆహుతి అవుతున్న సమయంలో స్థానికులు ఇండ్ల నుంచి నీటిని తీసుకొచ్చి ఆర్పేందుకు ప్రయత్నం చేసినా క్షణాల్లో అంతా ముగిసిపోయింది. ఎవరికీ ఏం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.