Ganesh Chatrudhi 2025: మీ ఆప్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి

Ganesh Chatrudhi 2025:  మీ ఆప్తులకు వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా చెప్పండి

స్మార్ట్​ ఫోన్​ వచ్చిన తరువాత  ప్రతి  పండుగకు ...ఉత్సవానికి  బంధువులకు.. స్నేహితులకు  వాట్సప్​ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.   ఈ వినాయక చవితి ( August 27)  సందర్భంగా మీ బంధుమిత్రులకు ఇలాంటి సందేశాలతో విష్ చేయండి.

  •  బొజ్జ గణపయ్య మీ కోరికలన్నింటినీ నెరవేర్చేందుకు భక్తితో గణేష్​ చతుర్థిని  ఆనందంగా జరుపుకోవాలని ... మీకు సకల విజయాలను అందించాలని కోరుకుంటున్నా...  మీకు మీ కుటుంబసభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు
  • గణేశుడు మన జీవితాలను ప్రకాశవంతం చేస్తూ .. జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులను తొలగించి 
  • ఎల్లప్పుడూ ప్రేమ, విజయాన్ని అనుగ్రహించాలని కోరుకుంటూ..  మీకు వినాయక చవితి శుభాకాంక్షలు
  • కొత్త సూర్యోదయం, కొత్త ప్రారంభం, దివ్య గణేశుడి ఆశీస్సులతో.. ఈ పండుగ సీజన్​ లో  మీ ఇంట్లో  మీ ఇల్లు ఆనందం  శ్రేయస్సుతో నిండాలనికోరుకుంటున్నాను.
  • ఓం వక్రతుండ మహాకాయ... కోటి సూర్య సమప్రభ ..నిర్విఘ్నం కురుమే దేవ...సర్వకార్యేషు సర్వదా... గణపతి బప్పా రాకతో మీకు అన్ని విధాలా సానుకూలత కలగాలని కోరుకుంటూ.. మీకు.. మీ కుటుంబ సభ్యులకు  వినాయక చవితి శుభాకాంక్షలు...
  • ఆ విఘ్నేశ్వరుడు మీరు చేపట్టిన పనులన్నీ  విజయవంతం చేయాలని గణపతిని ప్రార్థిస్తూ..   మీకు ఙ్ఞానం.. ఐశ్వర్యం.. .. ఆరోగ్యం.. అంతులేని ఆనందంతో పాటు మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ వినాయక చతుర్ధి....
  • కొత్త సూర్యోదయం, కొత్త ప్రారంభం, దివ్య గణేశుడి ఆశీస్సులతో.. మీరు అంచలెంచలుగా ఎదగాలని మనసారా కోరుకుంటూ.. మీకు.. మీ కుటుంబసభ్యులకు  వినాయక చవితి శుభాకాంక్షలు 
  •  ఈ వినాయక చవితి మన దుఃఖాలన్నింటినీ పోగొట్టి..  మన సంతోషాన్ని పెంచి.. మనందరికీ ఆయన అనుగ్రహాన్ని ప్రసాదించాలని..కోరుకుంటూ..  గణేశుడిని ప్రార్థిస్తున్నాను. గణేష్ చతుర్థి శుభాకాంక్షలు....
  • గణపతి బప్పా మోరియా...మీకు శాంతి... శ్రేయస్సు.. ఆరోగ్యం.. ఐశ్వర్యం.. ఆనందం.. అందిచాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మీకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
  • ప్రతి ముగింపు కొత్తదానికి నాంది ..  మన హృదయాలలో వినాయకుడు ఉంటే..  జీవితంలో దేనికి  చింతించాల్సిన పని లేదు. ఆయన ఆశీస్సులు... మీకు.. కుటుంబసభ్యులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ.. మీకు శ్రీ విశ్వావశునామ సంవత్సర వినాయకచవితి శుభాకాంక్షలు. 
  • ఈ వినాయకచవితి నుంచి మీ కలలు తామరపువ్వుల్లా వికసించాలని..  మీకు ఎదురయ్యే ప్రతి సవాలును ఎదుర్కొనే ఙ్ఞానం.. ధైర్యం.. గణేషుడి మీకు కలుగజేయాలని ప్రార్థిస్తూ.. గణేష్​ చతుర్థి శుభాకాంక్షలు..
  • వినాయకుని లడ్డు ఎంత తియ్యగా ఉంటుందో... మీ జీవితం కూడా అంతే తియ్యగా మారాలని కోరుకుంటూ మీకూ, మీ కుటుంబానికి  మోదకాలతో నిండిన వినాయక చవితి శుభాకాంక్షలు..
  • ఆ లంబోదరుడు మీ కన్నీళ్లను నవ్వులుగా మీ కష్టాలను విజయాలుగా మార్చాలని,కారుమబ్బులు కమ్మిన జీవితాల్లో 
  • ఇంద్రధనుసులు విరిసేలా చేయాలని కోరుకుంటూ..మీకు వినాయక చవితి శుభాకాంక్షలు
  • ఆ విఘ్నాధిపతి మీకు క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు ప్రసాదించాలని, సుఖసంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు ..  మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు..
  • వినాయకుడి కృపతో మీ ప్రయత్నాలన్నీ ఫలించి,  గణేషుడు మీ జీవితంలో అన్ని అడ్డంకులను తొలగించి  మీరు అనుకున్న ప్రతి లక్ష్యం చేరుకోవాలని ప్రార్థిస్తూ... మీకు  గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
  • గణేశుడు  మీకు ఎన్నో  చిరునవ్వులు... మరెన్నో  వేడుకలను తీసుకురావాలని కోరుకుంటూ..  మీకు, మీ ప్రియమైన వారికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.
  • పర్యావరణాన్ని పరిరక్షిస్తూ..అందరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ... మట్టి గణపయ్యను పూజిద్ధాం...మీకు, మీ కుటుంబసభ్యులకు ...వినాయక చవితి శుభాకాంక్షలు..

►ALSO READ | Ganesh Chatrudhi 2025: వినాయకుని హారతి మంత్రాలు ఇవే..!