
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ జైలర్ (Jailer). ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. నెల్సన్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వం వహించిన ఈ భారీ సినిమాకు..సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ (kalanithi Maran) నిర్మించారు. దీంతో జైలర్ సక్సెస్ కి కారకులైన వారికి విలువైన గిఫ్ట్స్ ను ఇస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
లేటెస్ట్గా జైలర్ విలన్ వినాయకన్(Vinayakan) అలియాస్ వర్మ భారీ మొత్తాన్ని అందుకున్నాడని టాక్. ఇప్పుడు ఎక్కడ చూసిన జైలర్ సక్సెస్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ మూవీలో నటించిన యాక్టర్స్పై చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో భీకరమైన విలనిజాన్ని చూపించిన వినాయకన్ పై ఫోకస్ పడింది. ఎందుకంటారా..? జైలర్ సక్సెస్లో కీలక క్యారెక్టర్ను చేసింది అతనే. ఇప్పుడు వినాయకన్ మోస్ట్ వాంటెడ్ విలన్గా మారిపోయాడు. ఇంతవరకు కామెడీ క్యారెక్టర్స్ చేసిన అతను..ఇక జైలర్తో విలన్ ట్రాక్లోకి ఎక్కినట్లు తెలుస్తోంది.
వినాయకన్ జైలర్ మూవీకి గాను తొలుత రూ.35 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకి ముందు వినాయకన్ అంత ఫేమస్ ఏం కాదు. తన స్థాయి మేరకు ఈ మొత్తాన్ని ఇవ్వగా..ఇక జైలర్ సక్సెస్తో కళానిధి మూడు ఇంతలు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో రజినీకాంత్ క్యారెక్టర్కు సమానమైన రోల్ చేసింది వినాయకన్ అని చెప్పడంలో సందేహం లేదు. చాలా ఇంటెన్స్ పెర్పార్మెన్స్తో ఆడియాన్స్ను ఆకట్టుకున్నాడు. డైరెక్టర్ నెల్సన్ వల్లే ఇదంతా సాధ్యమైందని వినాయకన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
Also Read : స్టార్ క్రికెటర్తో పూజా హెగ్డే పెళ్లి.. అందుకే సినిమాలకు దూరం?
వినాయకన్ మలయాళంలో చాలా మూవీస్ చేసినప్పటికీ..తమిళ్ లో వచ్చిన గుర్తింపు మాత్రం చాలా స్పెషల్. ఇన్నాళ్లు మెయిన్ విలన్స్ పక్కన కామెడీ రోల్ లో నటించిన వినాయకన్ ఇప్పుడు మెయిన్ విలన్ గా సెట్ అయ్యినట్లే అంటున్నారు సినీ క్రిటిక్స్.
ఇక ఇప్పటికే ప్రొడ్యూసర్ కళానిధి రజినీకాంత్‌కు రూ.1.24 కోట్ల BMW X7 కారుతో పాటు రూ.100 కోట్ల చెక్కును కూడా అందించారు. డైరెక్టర్ నెల్సన్‌కు కూడా పోర్చే లేటెస్ట్ కారు (Porsche Car)ను, చెక్కును అందజేశారు. నెల్సన్‌కు ఇచ్చిన కారు ఖరీదు రూ1.25 వరకు ఉంటుందని అంచనా.